ఖాకీ’ రాసలీలలు గుట్టురట్టు...రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు

Submitted by arun on Thu, 06/21/2018 - 13:09
kaki

కానిస్టేబుల్‌ ఓ మహిళతో సాగిస్తున్న రాసలీలలు గుట్టురట్టయ్యాయి. కర్నూలు శివారులోని కోడుమూరు రోడ్డులోని రాజీవ్‌ గృహకల్పలోని మూడవ అంతస్థులో గదిని అద్దెకు తీసుకుని కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. బుధవారం కానిస్టేబుల్‌ ఆన్‌డ్యూటీలోనే ఉంటూ కర్నూలుకు వచ్చి ఫోన్‌ చేసి మహిళను పిలిపించుకుని గదిలో ఉండగా ఇరుగుపొరుగు వారు గదికి తాళం వేసి బంధించి నాల్గవ పట్టణ పోలీసులకు పట్టించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ తప్పుడు వ్యవహారానికి పాల్పడటంపై కాలనీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసు పరువు పోతుందన్న ఉద్దేశంతో కొద్దిసేపు అతనిని స్టేషన్‌లో ఉంచుకుని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారు.  

English Title
Illegal Affair Constable Caught Red Handed

MORE FROM AUTHOR

RELATED ARTICLES