ప్రభాస్, నీహారిక పెళ్లి వార్తలపై స్పందించిన చిరు

Submitted by arun on Tue, 04/10/2018 - 14:31
pb

బాహుబలి ప్రభాస్ – కొణిదెల నీహారిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. రెండు కుటుంబాలు ఇప్పటికే మాట్లాడుతున్నాయి. చిరంజీవి పెద్ద తరహాగా.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో మాట్లాడారు.. నాగబాబు ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది.. ఇలాంటి వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ గాసిప్స్ లోనే కాకుండా.. హిందీ, ఇంగ్లీష్ తోపాటు ఇతర భాష వెబ్ సైట్లలో ఈ వార్త వైరల్ అయ్యింది. ఎన్డీటీవీ, ఇండియా టుడే లాంటి జాతీయ పోర్టల్స్ లోనూ ప్రముఖంగా వచ్చాయి. దీంతో ప్రభాస్ – నీహారిక పెళ్లి నిజమేనా అంటూ సినీ ఇండస్ట్రీ గుసగుసలాడుకుంటోంది. ఈ క్రమంలోనే.. కొణిదెల ఫ్యామిలీ ఈ వార్తపై స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం నీహారిక తన కెరీర్‌పై ద‌ృష్టి పెట్టింది కాబట్టి రూమర్స్‌ని తక్షణమే ఆపేయండి అని వెల్లడించారు. అంతకు ముందు ప్రభాస్, అనుష్క మధ్య లవ్ అఫైర్ ఉందని.. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరు స్టార్స్ ఈ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఓ ఛేజింగ్ సీన్ కోసం త్వరలో సాహో యూనిట్ యూఏఈ వెళ్లనుంది.

English Title
Here’s The Truth About The Marriage Of Prabhas And Chiranjeevi’s Niece Niharika!

MORE FROM AUTHOR

RELATED ARTICLES