భాగ్యనగరం సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Submitted by nanireddy on Tue, 09/11/2018 - 20:06
heavy-rain-in-two-telugu-states

హైదరాబాద్‌కు వరుణుడు ప్రతాపం చూపించాడు.  మధ్యాహ్నం వరకు ఎండ మండిపోగా.. సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబిలీహిల్స్, బంజారాహిల్స్ లోని పలు ప్రాంతాల్లో  రోడ్డుమీద  నీరు వరదలా పారింది.  ఆఫిస్ నుంచి ఇంటికి వెళ్ళె సమయం కావడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో జిహెచ్ఎంసి అధికారులు నీటిని తొలగించే పని చేపట్టారు. కాగా ఏపీలో కూడా భారీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం,  యర్రగొండపాలెం ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురిసింది. పశ్చిమ ప్రకాశంలో నెలల తరబడి వరుణుడు ముఖం చాటేయడంతో ఆ ప్రాంత రైతులు నేడు(మంగళవారం) కురిసిన భారీ వర్షానికి సంతోషం వ్యక్తం చేశారు. 

English Title
heavy-rain-in-two-telugu-states

MORE FROM AUTHOR

RELATED ARTICLES