బిల్డింగ్‌పై నుంచి దూకి ఫిల్మ్ రైటర్ ఆత్మహత్య

Submitted by arun on Thu, 07/12/2018 - 11:28
Film WriterSuicide

బాలీవుడ్ సినిమా రచయిత 32 ఏళ్ల రవిశంకర్ అలోక్ ముంబైలో బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ అందేరీలో నివాసం ఉంటున్న అలోక్‌ బుధవారం మధ్యహ్నాం 2 గంటల ప్రాంతంలో తను ఉంటున్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అలోక్‌ మానసిక ఒత్తిడిలో ఉన్నాడని.. అందుకోసం చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసిందన్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టమన్నారు. కాగా నానా పటేకర్‌ నటించిన అబ్‌ తక్‌ చప్పాన్‌ చిత్రాని రవి స్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేశాడని సమాచారం.
 

English Title
Film Writer Suicide

MORE FROM AUTHOR

RELATED ARTICLES