కత్తి మహేశ్‌ను విచారించి విడుదల చేసిన పోలీసులు

కత్తి మహేశ్‌ను విచారించి విడుదల చేసిన పోలీసులు
x
Highlights

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ ను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు..విచారించి విడుదల చేశారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ...బంజారాహిల్స్ పోలీస్...

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ ను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు..విచారించి విడుదల చేశారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ...బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కత్తి మహేష్ పై నాలుగు కేసులు నమోదయ్యాయ్. దీంతో పోలీసులు కత్తి మహేశ్ ను రాత్రి ప్రశ్నించారు. కొద్ది సేపటి తర్వాత ఆయన్ను ఇంటికి పంపించేశారు. విచారణకు సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించి పంపారు. ఆపై కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ "కేసుకు సంబంధించిన వివరాలు అడిగారు. చెప్పాను. ఇప్పుడు వివరణ కోరుతూ నోటీస్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని కూడా నోటీస్ లో ఉంది. అంతే. ఇకపైన మిగతా విషయాలు చూడాలి" అని అన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories