బాబాయిని పెళ్లి చేసుకుందని..

Submitted by arun on Thu, 08/23/2018 - 09:55
murder case

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను గొంతు కోసి హత్య చేశారు. వరుసకు బాబాయ్ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో సొంత తండ్రే కన్నకూతురిని గొంతు కోసి చంపాడు.  నాలుగేళ్ల క్రితం వరసకు బాబాయి అయ్యే వ్యక్తిని విజయ అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె అత్త చనిపోవడంతో ఈ నడుమ తిరిగి ఇంటికి వచ్చింది. తన పరువు పోయిందనే కోపంతో తండ్రి కూతురుని కడతేర్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

English Title
father killed his daughter

MORE FROM AUTHOR

RELATED ARTICLES