భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ...దారుణం

Submitted by arun on Mon, 08/13/2018 - 10:37
illegal affair

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తిరుమలగిరి సాగర్  మండలం అల్వాలలో అక్రమ సంబంధం పేరుతో మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసి చిత్తక్కొట్టారు. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుంటుందంటూ స్థంభానికి కట్టేసి మహిళ, ఆమె బంధువులు తీవ్రంగా కొట్టారు. బాధితురాలికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి  తరలించారు. గ్రామానికి చెందిన ముత్యాలమ్మ అనే మహిళ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమసబంధం నిర్వహిస్తోందనే అనుమానంతో ఆ వ్యక్తి భార్య రేణుక ఈరోజు తెల్లవారుజామున ఈ దారుణానికి ఒడిగట్టింది. అయితే గ్రామస్థులు అక్కడకు చేరుకోవడంతో రేణుక, ఆమె బంధువులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళ కట్టు విప్పేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English Title
family members beat woman in nalgonda

MORE FROM AUTHOR

RELATED ARTICLES