వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే రాంబాబు

వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే రాంబాబు
x
Highlights

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నేతలు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం ఏ పార్టీలో లేని...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నేతలు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం ఏ పార్టీలో లేని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే జగన్ సహా ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లను కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. అధిష్టానం ఆయన చేరికకు పచ్చజెండా ఊపడంతో అధికారికంగా ఈనెల లేదా జనవరి 8వ తేదీన అన్నా రాంబాబు వైసీపీలో చేరడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. ఆయనకు గిద్దలూరు ఇంచార్జి బాధ్యతలు అప్పజెప్పారు జగన్. 2009 లో గిద్దలూరు నుంచి గెలిచిన అన్నా.. కొన్ని రాజకీయ కారణాలతో టీడీపీలో చేరిపోయారు.

అయితే గిద్దలూరు నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచిన ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. దాంతో అన్నా రాంబాబు భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పరిణామంతో అన్నా రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు. దాదాపు ఆరునెలలుగా వైసీపీతో టచ్ లో ఉన్నారు. గిద్దలూరు తోపాటు మార్కాపురం, యర్రగోడపాలెం నియోజకవర్గాల్లో మంచి పట్టున్న రాంబాబును చేర్చుకోవడం ద్వారా మరింత బలపడవచ్చని వైసీపీ భావించింది. ఈ క్రమంలో అన్నా రాంబాబును ఆ పార్టీలో చేర్చుకుని గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇదిలావుంటే అన్నా రాంబాబుకు ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, ప్రస్తుత ఇంచార్జ్ ఐవి రెడ్డి తీవ్రంగా వ్యక్తిరేకిస్తున్నారు. మరి వారిని వైసీపీ ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories