బ‌న్నీ హీరోయిన్‌కి ఈ సారైనా అదృష్టం వ‌రిస్తుందా?

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 17:47

5 ఏళ్ల కెరీర్‌.. 5 సినిమాలు.. 3 భాష‌లు..ఇదీ అందాల భామ పూజా హెగ్డే గురించి సింపుల్‌గా చెప్ప‌మంటే ఎవ‌రైనా చెప్ప‌గ‌లిగేది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది.. కానీ న‌ట‌న శూన్యం. ఇక‌ విజ‌యాల సంఖ్య కూడా న‌ట‌న విష‌యంలో ఉన్న‌దే.  జీవా(ముగ‌మూడి - త‌మిళ్‌), నాగ‌చైత‌న్య (ఒక లైలా కోసం), వ‌రుణ్ తేజ్ (ముకుంద‌), హృతిక్ రోష‌న్‌(మొహంజ‌దారో), అల్లు అర్జున్ (డిజె - దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌).. ఇలా ఏ హీరో కూడా ఆమెకి క‌లిసి రాలేదు.  లాంగ్వేజ్ మారినా ఫేట్ మార‌డం లేదు.

అలాంటి పూజా చేతిలో ప్ర‌స్తుతం ఒకే ఒక ఆఫ‌ర్‌ ఉంది. అదే బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా.  డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ కైనా చెప్పుకోద‌గ్గ విజ‌యాలున్నాయి కానీ.. హీరో శ్రీ‌నివాస్ కి మాత్రం సాలిడ్ హిట్ లేనే లేదు.  ఈ నేప‌థ్యంలో పూజాకి కొత్త చిత్రం విజ‌యం చాలా కీల‌కంగా మారింది. ఈ సారైనా హిట్ కొడితే స‌రి.. లేదంటే.. ఫ్లాప్ ల విష‌యంలో డ‌బుల్ హ్యాట్రిక్ ని చాలా స‌క్సెస్‌ఫుల్‌గా త‌న వ‌శం చేసుకున్న‌ట్లవుతుంది పూజాకి. 

English Title
even this time bunny heroine get luck?

MORE FROM AUTHOR

RELATED ARTICLES