‘మద్యం మత్తు.. ఒకరి ప్రాణాలు బలి’...

Submitted by arun on Mon, 07/30/2018 - 17:11

హైదరాబాద్ కేపీహెచ్ బీలో బస్సు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు యూటర్న్ వద్ద అడ్డంగా వెళుతున్న బైక్ దారుడిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం తాగి బైక్ నడపడం వల్లే ప్రాణం పోయిందని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న గుడిసెను తగులబెట్టారు. 

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన శంకర్ కేపీహెచ్ బీలో ఉంటున్నాడు. ఓ గుడి లో వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కేపీహెచ్ బీ రోడ్డు నెంబర్ వన్ లో ఓ గుడిసెలో బెల్ట్ షాప్ కు అప్పడుప్పుడు వచ్చేవాడు. ఇవాళ కేపీహెచ్ బీ నుంచి బైక్ పై శంకర్ ఆలయం వద్దకు వస్తున్నాడు. యూటర్న్ వద్ద బైక్ ను అడ్డంగా మళ్లించాడు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో శంకర్ మృతి చెందాడు. 

శంకర్ మృతి విషయం తెలుసుకుని బంధు మిత్రులు రోధించారు. బెల్ట్ షాప్ లో మద్యం తాగి శంకర్ బైక్ నడిపించాడని అనుమానం వ్యక్తం చేశారు. బెల్ట్ షాప్ ఉన్న గుడిసెను నిప్పు అంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలి వద్దకు వచ్చారు. గుడిసెలోని గుట్కా ప్యాకెట్లను, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
Drunken man lost life in Road Accident

MORE FROM AUTHOR

RELATED ARTICLES