ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ సర్కారు మరో కీలక అడుగు

ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ సర్కారు మరో కీలక అడుగు
x
Highlights

సంక్షేమంలో మరో కీలక అడుగువేసేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. నిధులు, నీళ్లు, నియామకాలే లక్ష్యంగా సాధించిన తెలంగాణలో నిరుద్యోగులను ఆదుకునేందుకు...

సంక్షేమంలో మరో కీలక అడుగువేసేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. నిధులు, నీళ్లు, నియామకాలే లక్ష్యంగా సాధించిన తెలంగాణలో నిరుద్యోగులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. అర్హత ఉండి ఉద్యోగం లేని వారికి సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. నిరుద్యోగులకు ప్రత్యేక భృతిని అందించేందుకు వచ్చే బడ్జెట్ లోనే కేటాయింపులుండేలా చర్యలు తీసుకుంటుంది.

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ సర్కారు మరో కీలక అడుగు వేయబోతోంది. ఇప్పటికే రకరకాల సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రత్యేక భృతిని అందించాలనే ఆలోచన చేస్తోంది. నెలకు 2 వేల రూపాయల భృతిని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అవలింభించాల్సిన విధీ విధానాలు, బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు.

ఇటు లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కేసీఆర్ సర్కారు ఆ విధంగా చర్యలు తీసుకుంటూనే అర్హులైన నిరుద్యోగులను ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగిన తెలంగాణలో ఉద్యోగాల కల్పన అంతంతమాత్రంగానే ఉండటం దీనిపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతుంది.

మరోవైపు నిరుద్యోగులే లక్ష్యంగా జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. ప్రతిపక్షాలు కూడా ఇదే అంశం లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటు కాంగ్రెస్ కూడా అధికారంలోకొస్తే నిరుద్యోగ భృతిని అందజేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాల వ్యూహానికి చెక్ పెడుతూ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో కేసీఆర్ ఆదేశాలతో ఆర్థిక, విద్యాశాఖ అధికారులు నిరుద్యోగ భృతి విధివిధానాలపై కసరత్తు ప్రారంభించారు రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులుంటారని అంచనాకు వచ్చారు. వీరిలో పనికి ఆహార పథకం వంటి వాటి నుంచి లబ్ది పొందుతున్న వారు పోగా మిగతా 15 లక్షల మంది నిరుద్యుగులుంటారని లెక్కగట్టారు. వీరందరికి ఒక్కొక్కరికి 2 వేల చొప్పున భృతి అందించాలనుకుంటున్నారు. ఈ లెక్కన నెలకు 300 కోట్ల చొప్పున ఏటా 3 వేల 600 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఇలా గుర్తించిన నిరుద్యోగులకు జాబ్ కార్డు ఇవ్వనున్నారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories