డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ అరెస్ట్‌..

Submitted by arun on Thu, 05/24/2018 - 13:32
stalin

తమిళనాడులో డీఎంకే  నేతలు చేపట్టిన సిఎం కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.  స్టెరిలైట్ ఘటను నిరసనగా డీఎంకే  వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్టాలిన్ ను అరెస్ట్ చేశారు. స్టాలిన్ తో పాటు డీఎంకే  కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్టాలిన్ తో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఈనిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు పోలీసు కాల్పుల్లో 12 మంది మరణించిన ఇంకా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాల్పులకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలేక పోతే ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని  స్టాలిన్ డిమాండ్ చేశారు.
 

English Title
DMK leader Stalin detained as he protests against deaths during Thoothukudi violence

MORE FROM AUTHOR

RELATED ARTICLES