విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రంలో న‌టిస్తున్న స్టార్ డైరెక్ట‌ర్‌

Submitted by arun on Wed, 09/12/2018 - 11:19
NOTA

యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగానే రిలీజ్ అయ్యింది. ఇందులో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నోటా దర్శకుడు ఆనంద్‌ శంకర్‌.. మురుగదాస్‌ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే డైరెక్ట్‌ చేస్తుండటంపై ఆనంద్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ పొలిటికల్‌ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 

English Title
director ar murugadoss in vijay devarakonda nota movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES