క‌థ‌, ద‌ర్శ‌కుడుపై ఆధార‌ప‌డి ఉంటుంది - మ‌హేష్‌

క‌థ‌, ద‌ర్శ‌కుడుపై ఆధార‌ప‌డి ఉంటుంది - మ‌హేష్‌
x
Highlights

స్టార్ హీరో ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. 'నిజం', 'నాని', '1-నేనొక్క‌డినే',...

స్టార్ హీరో ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. 'నిజం', 'నాని', '1-నేనొక్క‌డినే', 'శ్రీ‌మంతుడు' చిత్రాల‌ను ఈ త‌ర‌హాలోనే క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్‌తో చేసుకుపోయారు మ‌హేష్‌. ఇక మ‌హేష్ తాజా చిత్రం 'స్పైడ‌ర్' కూడా కాస్త ప్ర‌యోగాత్మ‌కం అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా చేశారీ సూప‌ర్‌స్టార్‌. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిందీ చిత్రం.

ఇదిలా ఉంటే.. మ‌హేష్‌ని 'మ‌రోసారి ద్విభాషా చిత్రం చేస్తారా?' అని అడిగిన ఓ ప్ర‌శ్న‌కు, 'క‌థ‌, ద‌ర్శ‌కుడిని బ‌ట్టి ఆ విష‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. క‌చ్చితంగా భ‌విష్య‌త్‌లోనూ 'స్పైడ‌ర్' త‌ర‌హాలో ద్విభాషా చిత్రాలు చేస్తాను' అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. 'స్పైడ‌ర్' ఈ నెల 27న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories