మంత్రి కాబోతుండగా డీకే శివకుమార్ కు ఊహించని షాక్

Submitted by arun on Thu, 05/31/2018 - 17:21
dk

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ వ్యూహాలకు చెక్ పెడుతూ, జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయనకు సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు. నిన్న రాత్రి ఆయనకు సంబంధించిన వ్యక్తుల నివాసాలపై సెర్చ్ వారెంట్ తో అకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలతో శివకుమార్ షాక్ కు గురయ్యారు. తన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ అయిన డీకే సురేష్ తో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను తమకు నచ్చని వారిపై ఉసిగొల్పుతోందని ఆయన చెప్పారు. తన సన్నిహితుల ఇళ్లపై సీబీఐ దాడులు కూడా అందులో భాగమేనన్నారు. ఇప్పుడు తనకు సంబంధించిన ఆస్తులను కూడా బీజేపీ టార్గెట్ చేసిందన్నారు. ఇదిలా ఉంటే, డీకే శివకుమార్ ప్రెస్‌మీట్ ముగించిన గంటల వ్యవధిలోనే ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో సీబీఐ దాడులు జరిగినట్లు తెలిసింది. అయితే సీబీఐ మాత్రం.. శివకుమార్, ఆయన సోదరుడు సురేష్‌ల ఆస్తులకు సంబంధించి సెర్చ్ వారెంట్ జారీ చేయలేదని స్పష్టం చేసింది.
 
నోట్ల రద్దు సమయంలో రామనగరలోని కార్పొరేషన్ బ్యాంకు విషయంలో జరిగిన మోసానికి సంబంధించి ఈ దాడులు చేసినట్లు సీబీఐ చెబుతోంది. ఈ వ్యవహారంలో సీబీఐ ఆ బ్యాంకు చీఫ్ మేనేజర్ ప్రకాష్‌పై అప్పట్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆర్‌బీఐకి ఎలాంటి పత్రాలు సమర్పించకుండా 10లక్షల రూపాయల విలువైన కొత్త 5వందలు, 2వేల నోట్లను మార్చుకున్నారనేది సీబీఐ ప్రధాన అభియోగం. ఈ నగదు పొందిన వారిలో డీకే శివకుమార్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి పద్మనాభయ్యతో పాటు, అతని బంధువర్గం ఉన్నట్లు భావించి సీబీఐ ఈ మెరుపు దాడులకు దిగింది. అయితే 2017నాటి కేసులో ఇప్పుడు దాడులు చేయడంపై కాంగ్రెస్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బీజేపీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే దాడులు చేసినట్లు శివకుమార్ ఆరోపించారు.

English Title
Demonetised currency case: CBI raid likely against DK Shivakumar

MORE FROM AUTHOR

RELATED ARTICLES