ప్రచండ వేగంతో కదులుతున్న పెథాయ్‌

ప్రచండ వేగంతో కదులుతున్న పెథాయ్‌
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ఇప్పుడు పెనుతుఫాన్‌ గా మారిన సంగతి తెలిసిందే. దీనికి పెథాయ్‌ గా నామకరణం చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ పెథాయ్‌...

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ఇప్పుడు పెనుతుఫాన్‌ గా మారిన సంగతి తెలిసిందే. దీనికి పెథాయ్‌ గా నామకరణం చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ పెథాయ్‌ తుఫాన్‌ ప్రచండ వేగంతో కదులుతోంది. ప్రస్తుతం చెన్నైకి 670 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ సోమవారం సాయంత్రం ఒంగోలు, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. మత్సకారులను వేటకు వెళ్లోద్దని చెప్పింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు, జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. ఈ తుఫాను కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories