ఇళ్లల్లోకి పాములు, మొసళ్లు

ఇళ్లల్లోకి పాములు, మొసళ్లు
x
Highlights

కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా...ఇళ్లకు చేరుతున్న వారికి పాములు, మొసళ్లు దర్శనమిస్తున్నాయ్. మొన్నటి వరకు వరదలు వణికిస్తే ఇప్పుడు మొసళ్లు, పాములు...

కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా...ఇళ్లకు చేరుతున్న వారికి పాములు, మొసళ్లు దర్శనమిస్తున్నాయ్. మొన్నటి వరకు వరదలు వణికిస్తే ఇప్పుడు మొసళ్లు, పాములు భయపెడుతున్నాయి. పునరావాసాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న వారికి ఇళ్లలో పాములు, మొసళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కేరళలో వరద తగ్గినా స్థానికుల కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.

పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళుతున్నవారు బురదలో కూరుకుపోయిన సొంతిళ్లను చూడలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. దీనికి తోడు ఇళ్లల్లోకి పాములు, మొసళ్లు రావడంతో భయంతో వణికిపోతున్నారు. అడవుల్లోని జంతువులు, సర్పాలన్ని బురద నీటిలో ఉండటంతో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అడవుల్లోంచి వరదల్లో కొట్టుకొచ్చిన పాములు కేరళవాసులను భయపెడుతున్నాయి. మరోవైపు పాము కాట్ల కేసులూ భారీగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లోనే 53 కేసులు నమోదయ్యాయి. కేరళ వ్యాప్తంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories