మైదానమైనా.. ఎయిర్‌పోర్ట్‌ అయినా ధోనీకి పూల పాన్పే!

Submitted by lakshman on Tue, 09/19/2017 - 16:53

చెన్నై: టీమిండియా గురించి మాట్లాడుకునే ప్రతీ సందర్భంలో ధోనీ గురించి ప్రస్తావన రాకుండా ఉండదనడంలో అతిశయోక్తి లేదేమో. అంతలా క్రికెట్ అభిమానుల మనసుని చొరగొన్న ధోనీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఈ స్థాయికి చేరుకున్నాడు. కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే గత నెల శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో ఎంపైర్ నిర్ణయం రావడం కాస్త ఆలస్యమైంది. అంతే.. ధోనీ ఒక్కసారిగా చిన్న పిల్లాడైపోయాడు. స్టేడియంలోనే.. నేల మీద కాసేపలా బోర్ల పడుకుని కునుకు తీశాడు. ఈ సీన్ చూసిన క్రికెట్ అభిమానులు ధోనీ సింప్లిసిటీని మెచ్చుకున్నారు. డౌన్ టూ ఎర్త్ అంటే ఇదేనేమో అనుకుంటూ ధోనీపై ఫన్నీ సెటైర్లు వేసిన వారూ ఉన్నారు. మళ్లీ ఇలానే కింద పడుకుని ధోనీ మరోసారి కనిపించాడు.

చెన్నైలో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన అనంతరం కోల్‌కత్తాలో జరగబోయే రెండో మ్యాచ్‌లో ఆడేందుకు టీమిండియా ప్లేయర్స్ ఎయిర్‌పోర్టుకొచ్చారు. ప్రయాణ సమయం కంటే కాస్త ముందే చేరుకోవడంతో కొద్దిసేపు టీమిండియా ఆటగాళ్లంతా సేదతీరారు. ఆ క్రమంలో ధోనీ మళ్లీ బ్యాగ్ తల కింద పెట్టుకుని ఫ్లోర్‌పై పడుకున్నాడు. ఈ సమయంలో అక్కడున్న వారెవరో ఫొటో తీశారు. ఇప్పుడా ఫొటో నెట్‌లో వైరల్ అవుతోంది. ధోనీది ఎంత ఎదిగినా ఒదిగిన తత్వమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

dhonii

 

English Title
From cricket field to airports – Dhoni can sleep anywhere

MORE FROM AUTHOR

RELATED ARTICLES