డేటింగ్‌ పేరుతో హైటెక్‌ వ్యభిచారం... సినీ నటికి రూ.30 లక్షల ఆఫర్

Submitted by arun on Sat, 07/14/2018 - 10:24
Chennai

చెన్నైలో భారీ సెక్స్ రాకెట్‌ గుట్టురట్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియా ద్వారా డేటింగ్ సర్వీస్ పేరుతో కుర్రాళ్లకు వల వేస్తున్న ఇద్దర్ని కేటుగాళ్ల ఆటకట్టించారు పోలీసులు. ఓ తమిళ నటి చేసిన ఫిర్యాదుతో ఈ గుట్టు మొత్తం బయటపడింది. చాలా రోజులుగా వీరిద్దరూ తమిళ సినిమా సెలబ్రిటీల ఫోటోలతో ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు తేలింది. వీరిద్దర్ని ప్రశ్నించిన పోలీసులకు దర్యాప్తులో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఆ బ్రోకర్ల సెల్‌ఫోన్లలో సుమారు 70 మంది తమిళ సినీ, టీవీ హీరోయిన్ల ఫోటోలు, వారి మొబైల్‌ నెంబర్లు, వారితో డేటింగ్‌కు చెల్లించాల్సిన రేట్ల వివరాలు చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. జయలక్ష్మి సుమారు 30 చిత్రాల్లో నటించారు. కొద్ది రోజుల ముందు ఆమె మొబైల్‌కు ఓ వాట్సప్‌ సందేశం వచ్చింది.
 
అందులో ‘మీరు మంత్రులు, వీఐపీలతో డేటింగ్‌ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ దిగువ పేర్కొన్న ‘రిలేషన్‌షిప్‌ డేటింగ్‌ సర్వీస్‌’ సంస్థ ఫోన్‌ నెంబర్లకు ఫోన్‌ చేయండి.. రోజుకు రూ. 30 వేల నుండి రూ. 3 లక్షల దాకా సంపాదించుకోవచ్చు’ అనే సందేశం వుంది. తొలుత జయలక్ష్మి దీన్ని తేలికగా తీసుకున్నారు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధులమంటూ ఇద్దరు వ్యక్తులు అదే పనిగా ఫోన్‌ చేసి మంత్రులు, ప్రముఖులు ఆమెతో ఉల్లాసంగా గడిపేందుకు సిద్ధంగా ఉన్నారని, ఒప్పుకుంటే రూ.30 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లిస్తామని తెలిపారు. దీంతో ఆమె నగర పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాధన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు కవియరసు, మురుగపెరుమాళ్‌ అనే బ్రోకర్లను అరెస్టు చేశారు.

English Title
Cops arrest duo for making indecent proposal to actress

MORE FROM AUTHOR

RELATED ARTICLES