తెలంగాణలో కూడుకుంటున్న మహాకూటమి

తెలంగాణలో కూడుకుంటున్న మహాకూటమి
x
Highlights

మహాకూటమి కోసం ఇంతవరకూ రహస్యంగా, వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు తొలిసారి కలిసికట్టుగా కన్పించాయి. హైదరాబాద్ పార్క్...

మహాకూటమి కోసం ఇంతవరకూ రహస్యంగా, వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు తొలిసారి కలిసికట్టుగా కన్పించాయి. హైదరాబాద్ పార్క్ హయత్ లో సమావేశమైన మూడు పార్టీల ముఖ్య నేతలు, మహాకూటమి దిశగా తొలి అడుగు వేశారు. ఇది కేవలం ప్రాథమిక సమావేశమేనని, మరిన్ని భేటీలు నిర్వహిస్తామని చెప్పారు. పొత్తులు-సీట్ల పంపకాలపై మరింతగా చర్చించాల్సి ఉందన్నారు. టీఆర్ఎస్ ను గద్దెదించాలంటే, అన్ని పార్టీలూ కలిసిరావాలని భావిస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ . రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి.

తెలంగాణలో సరికొత్త కూటమి ఏర్పడబోతోంది. మహా కూటమి దిశగా టీకాంగ్రెస్‌, టీటీడీపీ మధ్య ఫస్ట్ మీటింగ్‌ జరిగింది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. పొత్తులతోపాటు సీట్ల సర్దుబాటుపైనే ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌-టీడీపీ-సీపీఐ పొత్తులు పెట్టుకుంటే ఏవిధంగా ముందుకెళ్లాలి, వచ్చే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశాలపై చర్చించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఇ‌ప్పటికే అభ్యర్ధుల జాబితా రెడీ చేసుకుంది. ఇక టీటీడీపీ కూడా దాదాపు లిస్ట్‌ను సిద్ధం చేసుకుంది. అయితే కూటమి ఏర్పాటులో భాగంగా టీకాంగ్రెస్‌, టీటీడీపీ, సీపీఐలు కమిటీలు వేసుకున్నాయి. అలాగే సింగిల్‌ మేనిఫెస్టో రూపకల్పనపైనా చర్చలు జరుపుతున్నారు. ఇక కోదండరాం పార్టీ టీజేఎస్‌తోనూ అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ... ఇప్పటికే కోదండరాంతో చర్చలు జరపగా, న్యూడెమోక్రసీ పార్టీతోనూ సంప్రందింపులు జరుపుతున్నారు. ముందుగా టీటీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ మధ్య సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చాక ఫైనల్‌గా కాంగ్రెస్‌తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే మహా కూటమి, పొత్తులపై క్లారిటీ రావడానికి మరో రెండు మూడు మీటింగ్‌లు కచ్చితంగా జరిగేలా కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories