కాంగ్రెస్ సీనియర్‌ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు

x
Highlights

అనుకున్న సమయానికి కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేయాలని భావిస్తున్న స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. వరుసగా రెండు రోజుల నుంచి...

అనుకున్న సమయానికి కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేయాలని భావిస్తున్న స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. వరుసగా రెండు రోజుల నుంచి సమావేశమవుతున్న కమిటీ సభ్యులు నియోజకవర్గాల వారిగా సమీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 29 సీట్లు మిత్రపక్షాలకు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. మిగిలిన 90 నియోజకవర్గాలకు గాను 57 చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేవని తుది జాబితాలోని అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఎవరూ లేరంటూ నిర్ధారణకు వచ్చారు
మిగిలిన వాటిల్లో 20 చోట్ల ఇద్దరి కంటే ఎక్కువగా పోటీ పడుతున్నట్టు స్క్రీనింగ్ కమిటీ నిర్ధారించింది. వీరిలో సీనియర్ నేతల కుటుంబ సభ్యులతో పాటు సామాజిక సమీకరణలు, ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో వచ్చి చేరిన నేతలు ఉన్నట్టు అధిష్టానానికి నివేదించింది. సీనియర్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహలు తమ కుటుంబ సభ్యులకు సీట్లు కోరుతున్నారు. అయితే ఇంటికో టికెట్ నిబంధన ఆధారంగా వీరు పోటీ చేయాలనుకునే సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేయలేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలంటూ అధిష్టానికి సూచించింది. దీంతో ఈ నలుగురు నేతలు అత్యవసరంగా ఢిల్లీ రావాలంటూ అధిష్టానం ఆదేశించింది.

సూర్యాపేట, ములుగు, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, స్టేషన్ ఘన్‌పూర్‌, తుంగతుర్తి, రాజేంద్ర నగర్‌, దుబ్బాక, మెదక్‌, పెద్దపల్లి, కోరుట్ల, వరంగల్ ఈస్ట్, కొత్తగూడెం, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, మేడ్చల్‌, పఠాన్‌చెరు, జుక్కల్ నియోజకవర్గాల్లో ఇద్దరి కంటే ఎక్కువ పోటీ పడుతున్నట్టు స్క్రీనింగ్ కమిటీ నివేదిక సిద్దం చేసింది. అశావాహులందరితో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించిన కమిటీ సభ్యులు ..ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరించేలా బుజ్జగింపులు చేయడానికి వారందరినీ ఢిల్లీ రమ్మని పిలిచారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ రోజు తుది జాబితాను సిద్దం చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. అభ్యర్ధుల జాబితాను ఈ సాయంత్రం భేటీ కానున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటికి అందజేయాలని భావిస్తున్నారు. తుది చర్చల అనంతరం కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాల అభ్యర్ధులను ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

అనుకున్న సమయానికి కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేయాలని భావిస్తున్న స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. వరుసగా రెండు రోజుల నుంచి సమావేశమవుతున్న కమిటీ సభ్యులు నియోజకవర్గాల వారిగా ఢిల్లలో సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని సీట్లలో పోటీ ఎక్కువ ఉండడం. సీనియర్లు తమ కుటుంబ సభ్యులకు కూడా సీట్లు కోరుతుండడంతో ఇవాళ మరోసారి సమావేశం కావాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. అలాగే అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. సీనియర్ నేతలతో పాటు 20 నియోజక వర్గాల ఆశావహులను ఢిల్లీ రావాలని స్క్రీనింగ్ కమిటీ కోరింది. దీంతో వారంతా హస్తిన బాట పట్టారు.

57 స్థానాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసింది అయితే 20 చోట్ల ఇద్దరి కంటే ఎక్కువగా పోటీ ఉండడంతో పీటముడి ఏర్పడింది. ఎటూ తేలని 20 సీట్లలో సీనియర్ నేతల కుటుంబ సభ్యులతో పాటు సామాజిక సమీకరణలు, ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో వచ్చి చేరిన నేతలు ఉన్నట్టు స్క్రీనింగ్ కమిటీ అధిష్టానానికి నివేదించింది. సీనియర్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహలు తమ కుటుంబ సభ్యులకు సీట్లు కోరుతున్నారు. అయితే ఇంటికో టికెట్ నిబంధన ఆధారంగా వీరు పోటీ చేయాలనుకునే సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేయలేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలంటూ అధిష్టానికి సూచించింది. దీంతో ఈ నలుగురు నేతలు అత్యవసరంగా ఢిల్లీ రావాలంటూ అధిష్టానం ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories