నా లవర్‌తోనే చనువుగా ఉంటావా..!

Submitted by arun on Wed, 06/06/2018 - 15:38
rakesh

తన గర్ల్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉంటున్నాడని ఆమె స్నేహితుడిని కత్తితో పొడిచాడో ఓ కాంగ్రెస్ కార్పొరేటర్ కుమారుడు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగేరె కేటీజే నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ లింగరాజు​కుమారుడు రాకేశ్‌ గత కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి ఓ క్లోజ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని రాకేశ్‌ తెలుసుకున్నాడు. తన ప్రియురాలు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని భావించాడు. అప్పటినుంచీ ఆ యువకుడిపై తన పగ తీర్చుకోవాలని భావించాడు రాకేశ్‌. ఈ క్రమంలో పథకం ప్రకారం మంగళవారం తన గర్ల్‌ఫ్రెండ్‌ స్నేహితుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. రాకేశ్‌ కత్తిదాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై దేవనగేనేలోని కేటీజే నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
 

English Title
Congress corporator's son stabs woman in Karnataka

MORE FROM AUTHOR

RELATED ARTICLES