కేంద్రంపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 03/27/2018 - 16:58
kcr

కేంద్రంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఈ దేశాన్ని సాకే 7 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి అని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రం తన పని తాను చేయకుండా రాష్ట్రాలను బికారులుగా మారుస్తోందని మండిపడ్డారు. దేశం ముందుకెళ్లాలంటే గుణాత్మక మార్పులు అవసరమన్నారు. 

దేశాన్ని సాకే 7 రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ అని చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్రం నుంచి కేంద్రానికి 50వేల కోట్లు పోతుంటే అందులో తిరిగి వచ్చేది సగం కూడా లేదన్నారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రాష్ట్రంలో ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇస్తున్నామని తెలిపారు. సీపీఎస్ ఉన్నది కేంద్రం చేతుల్లోనేనని, సీపీఎస్‌ను రద్దు చేసే అధికారం రాష్ర్టాలకు లేదని చెప్పారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అవినీతిని అరికట్టామన్న సీఎం గతంలో కాంట్రాక్టులు చేపడితే అవినీతి, ముందస్తు చెల్లింపులు జరిగేవని గుర్తు చేశారు. కాంట్రాక్టుల విషయంలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు, ఈపీసీలు రద్దు చేశామన్నారు. పూర్తి పారదర్శకతో ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. 

మరోవైపు 19వేల ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్బుతమైన ఫార్మాసిటీ తీసుకువస్తామని సీఎం చెప్పారు. యూరప్, అమెరికాల్లో కంటే మంచి స్టాండర్డ్‌లో, పొల్యూషన్ మొత్తం ప్రభుత్వ కంట్రోల్‌లో పెట్టి, అందులో ఒక యూనివర్శిటీ కట్టి వరల్డ్ బెస్ట్ ఫార్మా సిటీ  తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీని ద్వారా కొన్ని వేలమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు కేసీఆర్. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షిస్తాయన్న సీఎం ఓట్లను ఆకర్షించడమే రాజకీయ పార్టీల పని అని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు చేసేది అదే పని అని ఓట్లు ఆకర్షించపోతే రాజకీయ పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

English Title
cm kcr talks in assembly

MORE FROM AUTHOR

RELATED ARTICLES