ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోంది: చంద్రబాబు

Submitted by arun on Fri, 08/31/2018 - 16:32
babu

ఆంధ్రప్రదేశ్‌లో మరో అత్యాధునిక ఆస్పత్రి నిర్మాణానికి పునాది రాయి పడింది. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి భూమి పూజ చేశారు. రాష్ట్రం నుంచి  క్యాన్సర్ మహమ్మారిని తరిమికొడతమన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల సమీపంలో టీటీడీకి కేటాయించిన 5 ఎకరాల స్థలంలో రూ.1000 కోట్లతో ఈ ఆస్పత్రిని టాటా ట్రస్ట్‌ నిర్మిస్తోంది.

ఈ ఆసుపత్రి భూమి పూజ తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటుకు చొరవ చూపిన టాటా ట్రస్ట్‌కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోందని ప్రశంసలు కురిపించారు.  ఈ ఆస్పత్రి ఏర్పాటుతో క్యాన్సర్‌ను 75 శాతం ముందే గుర్తించవచ్చునని తెలిపారు. క్యాన్సర్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొడతమన్నారు చంద్రబాబు. ఈ క్యాన్సర్ ఆసుపత్రిలో మొత్తం వెయ్యి పడకల గానూ తొలి దశలో 376 పడకలతో ఈ ఆస్పత్రి ప్రారంభిస్తారు. ఈ ఆస్పత్రి ద్వారా రోగులకు క్యాన్సర్‌ చికిత్సతో పాటు దేశంలోని టాటా క్యాన్సర్‌ చికిత్స కేంద్రాల పరిధిలో పరిశోధనలు చేపడతారు.

English Title
CM Chandrababu Speech At Cancer Hospital Foundation Stone Ceremony

MORE FROM AUTHOR

RELATED ARTICLES