చికెన్‌ అంటే చిక్కులే... చుక్కల్లో ధరలు ఇక దిగిరావా?

Submitted by santosh on Sat, 05/12/2018 - 13:47
chicken rate hike

సుర్రుమనే ఎండల్లో.. చీప్‌గా దొరకాల్సిన చికెన్.. ప్రస్తుతం యమ కాస్ట్లీగా మారింది. మటన్ రేట్లను అందుకునేందుకు కోడి మాంసం పోటీ పడుతోంది. ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో చికెన్ 250 రూపాయల వరకు పలుకుతుంది. దీంతో వీకెండ్ వస్తే చాలు.. కిటకిటలాడాల్సిన చికెన్‌ షాపులు.. ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో చికెన్ ధరలు దిగొస్తాయి. శరీరానికి వేడి చేస్తుందనే అనుమానంతో వాడకం తగ్గిస్తారు. అందుకే సాధారణంగా ఈ సీజన్‌లో వాటి ధరలు కూడా తగ్గుతాయి. కానీ ఇప్పుడు ఎండాకాలంలోనూ.. చికెన్ ధరలు అమాంతంగా పెరిగాయి. 

ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో ధర.. ఏకంగా 250 రూపాయలకు పైగానే పలుకుతోంది. విత్ స్కిన్ అయితే 230 వరకు చెబుతున్నారు. ముఖ్యంగా గతకొద్ది రోజులుగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అప్పుడే భారీ వర్షం.. ఆ తర్వాత వెంటనే వడగాలులు తీవ్రంగా ఉండటంతో.. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని బతికే కోళ్లు.. చాలావరకు బరువు తగ్గుతున్నాయి. దీంతో పౌల్ట్రీ ఫాం నిర్వాహకులు వేసవిలో కోళ్ల పకం చేపట్టడానికి సుముఖుత చూపడం లేదు. ఇదే సమయంలో పెళ్లిల్లు, శుభకార్యాల సీజన్ కావడంతో.. కోడి మాంసానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కోడి మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. డిమాండ్ తక్కువే ఉన్నా అందుకు తగినంత సప్లయ్ లేకపోవడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. అందుకే ప్రస్తుతం చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. 

20 రోజుల క్రితం 160 నుంచి 180 రూపాయలు పలికిన చికెన్ ధరలు.. డిమాండ్ పెరగడంతో అదే లెవెల్లో ధరలు కూడా పెరిగాయి. గత మూడు వారాల నుంచి పెరిగిన ధరలతో.. తెలుగు రాష్ట్రాల చికెన్ లవర్స్.. కష్టాలు పడుతున్నారు. ఏ చిన్న అకేషన్ అయినా.. చికెన్ ను వడ్డించడం కామన్‌ అయిపోయిన ఈ రోజుల్లో.. పెరిగిన ధరలు.. సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంది. మరోవైపు ఈ నెల 17 నుంచి రంజాన్ సీజన్ మెదలుకానుండటంతో.. డిమాండ్  మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ధరలు కూడా ఇంకాస్త పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఇది చికెన్ ప్రియులకు కాస్త ఇబ్బంది కలిగించేందిగానే ఉంది.

English Title
chicken rate hike

MORE FROM AUTHOR

RELATED ARTICLES