కారు అనుకుని.. అంబులెన్సులో వెళ్లాడు

Submitted by arun on Mon, 12/18/2017 - 14:32
ambulance

ఆడి కారుకి, అంబులెన్స్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ మ‌ద్యం మ‌త్తులో చెన్నైకి చెందిన ఓ వ్యాపార‌వేత్త‌కి అవి రెండూ ఒకేలా క‌నిపించాయి. దీంతో స్నేహితుడిని ఆస్పత్రిలో చేర్పించేందుకు ఆడి కారులో వచ్చి, తిరిగి వెళ్లేటప్పుడు అంబులెన్సు తీసుకుని వెళ్లాడు. దక్షిణ చెన్నైలోని పళవాక్కం ప్రాంతానికి చెందిన మిథిల్‌ అనే వ్యాపారవేత్త అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడిని చేర్పించేందుకు ఆదివారం అర్థరాత్రి 1.30 ప్రాంతంలో స్థానిక ఆస్పత్రికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పార్కింగ్‌ స్థలంలో ఉన్న అంబులెన్సును తన కారు అనుకుని అందులో ఇంటికి వెళ్లిపోయాడు. దాంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబులెన్సును ఎత్తుకెళ్లాల్సినఅవసరం ఏముందని యాజమాన్యం యోచిస్తుండగా మిథిల్‌ తన డ్రైవర్‌ చేత అంబులెన్సును తిరిగి పంపించాడు.

ఈలోగా అంబులెన్స్ పోయిన విష‌యాన్ని గ్ర‌హించిన ఆస్ప‌త్రి వ‌ర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అర్థరాత్రి కావడంతో పొరపాటున అంబులెన్సును తన కారు అనుకుని మిథిల్ తీసుకెళ్లాడ‌ని అత‌ని డ్రైవ‌ర్ వారికి చెప్పాడు. ఇందుకు పరిహారం కూడా చెల్లించడానికి తన యజమాని సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అంబులెన్స్ దొర‌క‌డంతో ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఎలాంటి చర్యలు తీసుకోన‌ప్ప‌టికీ, జ‌రిగిన సంఘ‌ట‌న గురించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పోలీసులు మిథిల్‌కి స‌మ‌న్లు జారీ చేశారు.

English Title
Chennai: Drunk man drives ambulance

MORE FROM AUTHOR

RELATED ARTICLES