పార్టీ ఏర్పాటుపై సీబీఐ మాజీ జేడీ క్లారిటీ...

Submitted by arun on Sat, 08/18/2018 - 12:12
jd

కొంతకాలం కిందట వీఆర్‌ఎస్‌ తీసుకొని ఏపీలో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా పలువురు నేతలు రాజకీయాల్లోకి వస్తాడేమోనని అనుమానం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఓ సందర్భంలో విమర్శలు చేశారు కూడా. ఆయన బీజేపీ చేరతారంటే... కాదు, జనసేనలో చేరాయం పక్కా అని అంచనాలు వేశారు. కానీ, ఏ పొలిటికల్ పార్టీతో సంబంధంలేకుండా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ... రైతులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఇదంతా పార్టీ పెట్టడం కోసమే చేస్తున్నారనే అభిప్రాయాలు కొందరు వెలిబుచ్చారు. 

కాని తాజాగా లక్ష్మీనారాయణ తనకు పార్టీ పెట్టే ఉద్దేశం లేదని చెప్పేశాడు. రైతుల సంక్షేమం కాంక్షించే పార్టీతోనే తన రాజకీయ పయనం సాగుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. తనకు పార్టీ పెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లి వచ్చారు. తొలుత జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐలు గ్రామంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే తాను తొమ్మిది జిల్లాల్లో పర్యటించానని, మిగతా నాలుగు జిల్లాల్లోనూ పర్యటించిన అనంతరం తన రాజకీయ భవిష్యత్తుపై కార్యాచరణ తెలియజేస్తానన్నారు.
 

English Title
cbi former jd lakshmi narayana gives clarity on new political party

MORE FROM AUTHOR

RELATED ARTICLES