సి విటమిన్‌తో కేన్సర్ కణాలకు చెక్!

Submitted by lakshman on Sun, 09/17/2017 - 21:48

ఏ ఆహారం తీసుకుంటే కేన్సర్ ముప్పును తగ్గించవచ్చు, ఏ విటమిన్లు ఈ వ్యాధి కారక కణాలను నాశనం చేస్తాయి.. అనే దిశగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఓ అధ్యయనంలో కేన్సర్ కణాలను విటమిన్-సి నాశనం చేస్తోందని తేలింది. ఆంకోటార్గెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యాయాన్ని ప్రచురించారు. ఇతర మందులతో పోలిస్తే.. కేన్సర్ మూల కణాలను విటమిన్-సి పది రెట్లు ఎక్కువగా అంతం చేస్తోందని, వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటోదని సదరు అధ్యయనం తేల్చింది. నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి ఎక్కువగా లభిస్తుందనే సంగతి తెలిసిందే.

కేన్సర్‌పై పోరాడేందుకు రోజువారీ ఆహారంలో భాగంగా ఎంత మోతాదులో విటమిన్-సి తీసుకోవాలనే విషయమై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. మామూలుగా అయితే రోజుకు 90 మిల్లీ గ్రాముల విటమిన్ సి తీసుకుంటే సరిపోతుంది. కానీ ఒత్తిడితో సతమతం అవుతున్నప్పుడు, కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్నప్పుడు రోజుకు 2000 మిల్లీ గ్రాముల మేర విటమిన్-సి తీసుకోవాలని నేచురల్ హెల్త్ ఎక్స్ పర్ట్స్ సలహా ఇస్తున్నారు. విటమిన్-సి శరీరంలో నిల్వ ఉండదు. కాబట్టి ఈ విటమిన్ లోపం ఉండొద్దంటే రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం తప్పనిసరి.

English Title
c vitamin prevent cancer cells

MORE FROM AUTHOR

RELATED ARTICLES