అందుకే వైసీపీని వీడి.. టీడీపీలో చేరా.. : బుట్టా రేణుక

అందుకే వైసీపీని వీడి.. టీడీపీలో చేరా.. : బుట్టా రేణుక
x
Highlights

కేంద్రప్రభుత్వం.. హోదా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్‌ విషయంలో రాష్ట్ర ప్రజలను...

కేంద్రప్రభుత్వం.. హోదా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్‌ విషయంలో రాష్ట్ర ప్రజలను భాజపా అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి కర్నూలు ఎంపీగా ఆమె గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా.. తర్వాత ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తాజాగా.. తాను పార్టీ మారడానికి గల కారణాలను ఆమె వివరించారు. కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీకి దూరమయ్యానని ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్రం ఎంతో అన్యాయం చేసిందన్న ఆవేదనను వ్యక్తం చేసిన ఆమె, విశాఖపట్నానికి రైల్వే జోన్ విషయంలోనూ అదే వైఖరిని అవలంబించిందని విమర్శించారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని బుట్టా రేణుక వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories