ధ్యానంలో సన్యాసి.. చంపేసిన చిరుతలు..

ధ్యానంలో సన్యాసి.. చంపేసిన చిరుతలు..
x
Highlights

మహారాష్ట్ర అడవిలో విషాదం చోటుచేసుకుంది. ధ్యానంలో ఉన్న బౌద్ధ సన్యాసిని దారుణంగా చంపేశాయి చిరుతపులి. ఈ ఘటన చంద్రాపూర్ జిల్లా రాండెగి ప్రాంతానికి...

మహారాష్ట్ర అడవిలో విషాదం చోటుచేసుకుంది. ధ్యానంలో ఉన్న బౌద్ధ సన్యాసిని దారుణంగా చంపేశాయి చిరుతపులి. ఈ ఘటన చంద్రాపూర్ జిల్లా రాండెగి ప్రాంతానికి అడవిలో జరిగింది. రాహుల్ వాల్కే (35) అనే సన్యాసి నిత్యం ధ్యానంలోనే గడిపేవారు. ఈ క్రమంలో రాండెగి సమీపంలోని అడవిలో చరిత్రాత్మక బౌద్ధ దేవాలయం పక్కన చెట్టు కింద ధ్యానం చేసుకుంటుంటారు. ఆయనకు ఇద్దరు శిష్యులు రోజు భోజనం తెచ్చేవారు. అయితే నెల రోజుల కిందట రాహుల్ వాల్కే కనిపించకుండా పోయారు. ఈ విషయంపై ఇద్దరు శిష్యులు పోలీసులకు సమాచారం ఫిర్యాదు చేశారు. తాడోబా అంధారి టైగర్ రిజర్వు డిప్యూటీ డైరెక్టర్ గజేంద్ర నార్వానె సహకారంతో పోలీసులు అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గతంలోనే ఆ అడవిలో చిరుతలు సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. అయినా రాహుల్ వాల్కే వినకుండా అక్కడే ధ్యానంలో మునిగితేలాడు. ఈ క్రమంలో చిరుతలే దాడి చేసి ఆయనను చంపేసి ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories