విరిగిన పడవ.. ఇద్దరు దుర్మరణం.. 26 మంది గల్లంతు..

Submitted by nanireddy on Wed, 09/05/2018 - 20:06
boat-accident-guwahati

విద్యార్థులతో వెళుతున్న పడవ ప్రమాదవశాత్తు నీటిలో పడింది. దీంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన గువాహటిలోని బ్రహ్మపుత్ర నదిలో జరిగింది. 40 మంది విద్యార్థులతో వెళుతున్న పడవ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో పడవ రెండు ముక్కలైంది. అందులో ఇద్దరు నీటమునిగి మృతిచెందగా.. మరో 26 మంది గల్లంతు అయ్యారు. కొందరు ప్రయాణికులు ఈదుతూ సురక్షితంగా బయటకు వచ్చారు. కాగా తీరం నుంచి 200 మీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో గల్లంతు అయిన వారికోసం విపత్తు దళం సహాయక చర్యలు చేపట్టింది.

English Title
boat-accident-guwahati

MORE FROM AUTHOR

RELATED ARTICLES