నేను ఢిల్లీ నుంచి వచ్చా.. త్వరలో ఓ గొప్ప వార్త వినబోతున్నారు

Submitted by arun on Mon, 09/24/2018 - 11:29

తెలంగాణలో సీఎం అభ్యర్థిని ప్రకటించే యోచనలో ఉంది బీజేపీ. ముందుస్తు ఎన్నికల రేసులో స్పీడు పెంచుతున్న బీజేపీ.. సీఎం అభ్యర్థిని ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. స్వామి పరిపూర్ణానంద లేక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నేతలతో చర్చించిన బీజేపీ అధిష్టానం చర్చించినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, స్వామి పరిపూర్ణానంద ఇప్పటికే ఢిల్లీ వెళ్లివచ్చారు. దీంతో స్వామీజినే సీఎం రేసులో ముందున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఛార్మినార్ లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న పరిపూర్ణానంద స్వామి.. తాను ఢిల్లీ నుంచి వచ్చానని, త్వరలో ఒక గొప్ప వార్త వినబోతున్నారని చెప్పారు. వచ్చే వినాయకచవితికి మార్పు రాబోతుందని స్వామిజీ తెలిపారు. 

English Title
BJP Swami Paripoornananda Crucial Comments on His Delhi Tour

MORE FROM AUTHOR

RELATED ARTICLES