అందుకే కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పా: పురందేశ్వరి

Submitted by arun on Tue, 06/26/2018 - 13:22
purandeswari

భారతీయ జనతా పార్టీ పోలవరం ప్రాజెక్టుకు సహకరించలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. విజయవాడలో మంగళవారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపాలని తాను పట్టుబట్టానని, రాష్ట్ర విభజన బిల్లులో ఆ విషయాన్ని కలపని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని బీజేపీ మహిళా నేత పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆమె, ఏపీలో ఆ ఏడు మండలాలనూ విలీనం చేసింది బీజేపీయేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎన్డీయే చిత్తశుద్ధితో ఉందని, రూ. 1935 కోట్ల విలువైన బిల్లులకు సంబంధించిన రిపోర్టు ఇంకా అందలేదని అన్నారు. జమిలి ఎన్నికలకు వెళ్లాలని తమ పార్టీ నేతలు భావిస్తున్నారని, అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనని అన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే తెలుగుదేశం పార్టీ తమను ఎందుకు విమర్శిస్తోందని ప్రశ్నించిన పురందేశ్వరి, వైసీపీ ప్రజా ప్రతినిధులకు తీసుకుని, వారికి పదవులిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు.

English Title
BJP leader Daggubati Purandeswari press meet

MORE FROM AUTHOR

RELATED ARTICLES