సంయమనంతో పరిష్కరించుకోవాలి: సీఎం కేసీఆర్

సంయమనంతో పరిష్కరించుకోవాలి: సీఎం కేసీఆర్
x
Highlights

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్...

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రోడ్డు రవాణా సంస్థ ఆస్తుల పంపకాలకు సంబంధించి విజయవాడలో సెప్టెంబర్ 21న రెండు రాష్ట్రాల అధికారుల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి తెలంగాణ తరపున ఎలాంటి వైఖరి అవలంబించాలనే అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో నేడు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒక రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఎలాంటి నియమాలనిబంధనలు వర్తిస్తాయో.. ఏపీకి కూడా అలాంటి నియమాలే వర్తిస్తాయని సీఎం గుర్తు చేశారు. పార్లమెంట్‌ అంగీకరించిన చట్టానికి లోబడి ఆస్తుల పంపకాలు జరపాలని సీఎం చెప్పారు. అప్పటికీ ఏవైనా సమస్యలు ఉండి.. సయోధ్య కుదరకపోతే సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి సమస్యను పరిష్కరించుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories