స్టార్ హీరోల‌కు అనుష్క స‌వాల్

Submitted by lakshman on Sun, 01/28/2018 - 09:39
 bhaagamathie movie collection

స్టార్ హీరోల‌కు భాగ‌మ‌తి స‌వాల్ విసురుతోంది. పండ‌గ సీజ‌న్ లో పెద్ద సినిమాలు బోల్తాప‌డ్డాయి. అనుకున్నంతగా ఆక‌ట్టుకోలేక వారంరోజులకే చాప‌చుట్టేశాయి. కానీ అనుష్క మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స్టార్ హీరోల‌కు స‌వాల్ విసురుతోంది. స్టార్ హీరో ఉంటే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టొచ్చు అనే సాంప్ర‌దాయాన్ని ప‌క్క‌న పెట్టిన ఈబెంగ‌ళూరు బ్యూటీ భాగ‌మ‌తితో అద‌ర‌గొడుతుంది. సినిమా విడుద‌ల‌తో స్టార్ హీరోల‌కే బ‌య‌ప‌డే బ‌య‌ర్లు అనుష్కాను న‌మ్మి కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమాను విడుద‌ల చేశారు.  ఆ న‌మ్మ‌కాన్ని వ‌మ్మ చేయ‌కుండా  బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 
అనుష్క‌కు న‌మ్మ‌కంతో సినిమా విడుద‌ల చేసిన బ‌య్య‌ర్లకు ఓపెనింగ్స్ భారీగా వ‌చ్చాయ‌ని ..వ‌సూళ్ల హ‌వా కొన‌సాగుతుంద‌ని సినీ పండితులు అంటున్నారు. అంతేకాదు సంక్రాంతికి ముందు సంక్రాంతి త‌రువాత కొన్ని పెద్ద సినిమాలు వాయిదా ప‌డ్డాయి. అనుష్క భాగ‌మ‌తి వ‌స్తుంద‌నే ఉద్దేశంతో ముందుగానే జాగ్ర‌త్త‌ప‌డ్దారు. లేదంటే భాగ‌మ‌తి దెబ్బ‌కు మిగిలిన సినిమాలు న‌ష్ట‌పోయే ప‌రిస్థ‌తి వ‌చ్చేద‌ని ఈ సినిమా క‌లెక్ష‌న్లు చూసిన క్రిటిక్స్ చెబుతున్నారు.  
 

English Title
bhaagamathie movie collection

MORE FROM AUTHOR

RELATED ARTICLES