ఆ రోజుల్లో నాన్నగారూ.. అంటున్న బాలయ్యా!

Submitted by arun on Mon, 03/05/2018 - 17:41
Balakrishna

అవకాశం వస్తే చాలు. నాన్నగారూ.. అప్పట్లో.. అంటూ.. నందమూరి తారకరామారావు గురించి.. ఆయన పుత్రరత్నం నందమూరి నటసింహం బాలయ్యబాబు.. అభిమానాన్ని కురిపించేస్తూ ఉంటారు. ఎన్ అంటే నటనాలయం.. టీ అంటే తారామండలంలో చంద్రుడు.. ఆర్ అంటే రాజకీయ దురంధరుడు అంటూ తండ్రిని ఆకాశానికెత్తేసే బాలయ్య బాబు.. ఇప్పుడు స్వయంగా అదే ఎన్టీఆర్ పాత్రలో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు.

అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు స్వయంగా ప్రకటించేశాడు. మార్చి 29న సినిమా షూటింగ్ ను లాంఛనంగా మొదలు పెట్టబోతున్నట్టు కూడా తెలిపారు. సినిమాకు చాలా మంది పేర్లను సూచించారని చెప్పిన బాలకృష్ణ.. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు.

దీంతో.. నందమూరి తారక రామారావు సినిమాలో.. ఏం ఉంటుంది? కేవలం రాజకీయాలే ఉంటాయా? వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తారా? లక్ష్మీ పార్వతి రోల్ ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు పాత్రను ఎలా చిత్రీకరిస్తారు? ఇలా రకరకాల చర్చలు అప్పుడే మొదలైపోయాయి.

English Title
Balakrishna on About NTR-Biopic

MORE FROM AUTHOR

RELATED ARTICLES