పోలీసుల అదుపులో మహిళా కిడ్నాపర్ ..

Submitted by arun on Thu, 07/05/2018 - 10:48
baby

కోఠి మెటర్నిటీ ఆస్పత్రి నుంచి శిశువును కిడ్నాప్  చేసిన మహిళను పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితురాలు నైనారాణిని బీదర్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి... హైదరాబాద్ తీసుకొస్తున్నారు. నైనా బీదర్‌లోని షాగంజ్‌లో నివాసం ఉంటోంది. ఆమె భర్త సైమన్‌ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ సమీపంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తనకు రెండుసార్లు గర్భస్రావం అయిందని, భవిష్యత్తులో పిల్లలు పుట్టరన్న అనుమానంతోనే చిన్నారిని ఎత్తుకెళ్లినట్టు నైనా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు వివరించింది. ఎలాగైనా సరే తల్లిని కావాలన్న ఉద్దేశంతో బీదర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చానని శనివారం రెండు, మూడు ఆసుపత్రులను పరిశీలించి ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకున్నట్టు పోలీసుల విచారణలో చెప్పింది. మంగళవారం ఉదయం ఆసుపత్రికి వచ్చి ప్రసూతి వార్డులో సుజాత జన్మనిచ్చిన ఆరురోజుల శిశువును కిడ్నాప్‌ చేసి బీదర్‌కు తీసుకెళ్లినట్టు నైనా పోలీసులకు వివరించింది. 

English Title
Baby Kidnapping Case | Accused Women Arrested by Police | at Bidar

MORE FROM AUTHOR

RELATED ARTICLES