స్ట్రాబెరీల్లో కుట్టు సూదులు... 6 రాష్ట్రాల్లో విక్రయాలు నిలిపివేత

స్ట్రాబెరీల్లో కుట్టు సూదులు... 6 రాష్ట్రాల్లో విక్రయాలు నిలిపివేత
x
Highlights

ఆస్ట్రేలియాలోని దేశీయ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న స్ట్రాబెరీ పండ్లలో ఇటీవల సూదులు, పిన్నులు బయటపడ్డాయి. దీంతో వినియోగదారులు వాటిని ము క్కలుగా...

ఆస్ట్రేలియాలోని దేశీయ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్న స్ట్రాబెరీ పండ్లలో ఇటీవల సూదులు, పిన్నులు బయటపడ్డాయి. దీంతో వినియోగదారులు వాటిని ము క్కలుగా కోసుకుని తినాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచింది. స్ట్రాబెరీలో సూది ఉన్న కారణంగా ఒక యువకుడు తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. ఈ నేపధ్యంలో ఆస్ట్రేలియాలోని ఆరు రాష్ట్రాల్లో స్ట్రాబెరీ విక్రయాలను నిలిపివేశారు. అలాగే స్ట్రాబెరీలను మెటల్ డిటెక్టర్లతో పరిశీలిస్తున్నారు. ఆస్ట్రేలియా నూతన ప్రధాని స్కాట్ మారిసన్ దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని 15 ఏళ్ల పాటు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఈ దుశ్చర్యలకు పాల్పడే నిందితుల ఆచూకీ తెలిపిన వారికి సుమారు 50లక్షల నజరానాను ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories