పెట్రోల్ అమ్మిన అనుష్క..

పెట్రోల్ అమ్మిన అనుష్క..
x
Highlights

భాగ‌మ‌తి సినిమాతో భారీ హిట్ కొట్టిన అనుష్క ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొడుతూ...

భాగ‌మ‌తి సినిమాతో భారీ హిట్ కొట్టిన అనుష్క ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొడుతూ క‌నిపించ‌డం అందరికి షాకింగ్‌గా మారింది. ఏదో సినిమా కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. లక్ష్మీ మంచు హోస్ట్‌గా కొన్ని నెలల క్రితం మేము సైతం అనే ప్రోగ్రాం వచ్చింది గుర్తుంది కదా. ఆ ప్రోగ్రాం సీజన్ -2 షూటింగ్ స్టార్ట్ అయింది.

ఈ ప్రోగ్రాంలో అనుష్క గెస్ట్‌గా రాబోతోంది. ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ వచ్చేసి, ఈ ప్రోగ్రాంకి గెస్ట్‌గా వ‌చ్చేవారు ఏదో ఒక‌ ప‌ని చేసి ఆ వ‌చ్చిన డ‌బ్బుతో పేద‌ల‌కి సాయం చేయ‌డం ఈ కార్యక్ర‌మం ముఖ్య ఉద్దేశం. మేము సైతం సీజ‌న్ 1 పూర్తి కాగా త్వ‌ర‌లో సీజ‌న్ 2 స్టార్ట్ కానుంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా అనుష్క హైదరాబాద్‌లోని ఫిలింనగర్ రోడ్ నంబర్ 1లో పెట్రోల్ అమ్మి డబ్బు సంపాదించింది. ఆమెని చూసేందుకు అభిమానులు బారులు తీరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories