నువ్వు లేకుండా నేను లేను.. అనుష్క ఎమోషనల్ పోస్ట్!

Submitted by arun on Tue, 07/31/2018 - 13:19
Anushka

అనుష్క తల్లి ప్రపుల్లా శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేసిన అనుష్క 'నువ్వు లేకుండా నేను లేను. నువ్వు నా పక్కన ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాను. హ్యాపీ బర్త్ డే అమ్మా' అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. అనుష్క త‌న త‌ల్లి బ‌ర్త్‌డేని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. త‌ల్లి ప్ర‌పుల్లా శెట్టి జ‌న్మ‌దినోత్స‌వాన్ని పున‌స్క‌రించుకొని తల్లి చేత కేక్ క‌ట్ చేయించింది ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. `నువ్వు, నీ ప్రేమ‌ లేక‌పోతే నేను ఏ ప‌నీ చేయ‌లేను. నువ్వు నా ప‌క్క‌నుంటే జీవితంలో ఏదైనా సాధించ‌గ‌లుగుతాను. హ్యాపీ బ‌ర్త్‌డే అమ్మా` అంటూ అనుష్క త‌న త‌ల్లికి విషెస్ తెలియ‌జేసింది. ఇటీవ‌ల అనుష్క త‌ల్లి కొద్ది రోజులుగా అనుష్క పెళ్ళిపై వ‌స్తున్న వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ లాంటి అల్లుడు రావాల‌ని కోరుకుంటున్నాం కాని, ప్ర‌భాస్ మా ఇంటి అల్లుడుగా రావ‌డం లేద‌ని పుకార్లపై క్లారిటీ ఇచ్చింది.

English Title
anushka emotional post about her mother

MORE FROM AUTHOR

RELATED ARTICLES