నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు: ప్రదీప్

x
Highlights

యాంకర్ ప్రదీప్ టచ్‌లోకి వచ్చాడు. డిసెంబర్ 31 అర్ధరాత్రి.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రదీప్.. మొత్తానికి అజ్ఞాతం...

యాంకర్ ప్రదీప్ టచ్‌లోకి వచ్చాడు. డిసెంబర్ 31 అర్ధరాత్రి.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రదీప్.. మొత్తానికి అజ్ఞాతం వీడాడు. తాను ఎందుకు కౌన్సిలింగ్‌కు హాజరుకాలేకపోయానన్న దానిపై ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన దగ్గర్నుంచి.. అధికారుల నుంచి వచ్చిన సూచనల ప్రకారమే నడుచుకుంటున్నానని వీడియోలో చెప్పాడు ప్రదీప్. చట్టానికి లోబడే ఉంటాను కానీ అతిక్రమించబోనన్నాడు. పోలీసులిచ్చే కౌన్సిలింగ్‌తో పాటు దాని తర్వాత జరిగే వాటికి కూడా హాజరవుతానని చెప్పాడు ప్రదీప్.

ముందుగా ఒప్పుకున్న షూటింగ్స్ ఉండటం వల్లే.. కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయానని చెప్పాడు ప్రదీప్. అంతేకాక తనకు ఫోన్లు కూడా చాలా ఎక్కువగా వస్తుండటంతో.. కొన్ని ముఖ్యమైన కాల్స్‌కు కూడా స్పందించలేకపోయానని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ విషయంలో చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటంన్నిటినీ స్వీకరిస్తానన్నాడు. గతంలో డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దని ఓ వీడియోలో చెప్పానని.. దురదృష్టవశాత్తూ తానే దానిని ఉల్లంఘించాల్సి వచ్చిందన్నారు. అందుకు క్షమించండని చెప్పాడు. ఇలాంటి తప్పు ఎవరూ చేయకూడదన్నాడు ప్రదీప్.

డిసెంబర్ 31 అర్ధరాత్రి.. రోడ్ నెంబర్ 45లో పోలీసులు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్‌లో ప్రదీప్ అడ్డంగా దొరికిపోయాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో.. మద్యం మోతాదు 178గా తేలింది. అప్పటికప్పుడు ప్రదీప్‌ వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు.. బేగంపేటలోని కౌన్సెలింగ్‌ సెంటర్‌కు హాజరు కావాలని చెప్పి వదిలేశారు. తర్వాత.. సోమ, మంగళవారాల్లో ప్రదీప్ కౌన్సెలింగ్‍‌కు హాజరవుతారని అంతా భావించారు. కానీ.. ప్రదీప్ రాకపోవడంతో ఎన్నో పుకార్లు వచ్చాయి. వాటన్నింటికి క్లారిఫికేషన్ ఇస్తూ.. ఇప్పుడు ప్రదీప్ వీడియో రిలీజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories