కర్ణాటకలో వింతజీవి.. కలకలం

Submitted by arun on Tue, 06/05/2018 - 13:16

ఓ వింత ఆకారాన్ని పట్టుకున్నారని అది దెయ్యమని కొందరు కాదు కాదు ఏలియన్ అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ జీవికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హడలెత్తిస్తున్నాయి. పంజాలోని ఓ మారు మూల ప్రాంతమని లేదు లేదు కర్ణాటకలోని ఓ మారు మూల గ్రామం అని ప్రచారం చేస్తున్నారు. పశువులపై దాడి చేస్తున్న ఆ వింతజీవిని జనం పట్టుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆ దృశ్యాలు మాత్రం నిజం కాదని ఏదో షార్ట్ ఫిల్మ్ కు సంబంధించినవనే మరో ప్రచారమూ సాగుతోంది.

కర్నాటకలోని పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా ఈ దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. వింత వింత రూపాల్లో దర్శనమిస్తున్న జీవులు... ప్రజలకు కంటి మీద రెప్పపడనీయడం లేదు.   గ్రహంతరవాసులు భూమి పైకి చేరుకున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఈ దృశ్యాలు తోడు కావడంతో జనం ఎక్కడికక్కడ జడుసుకుంటున్నారు.  అదిగో ఏలియన్స్ అంటూ ఒకరంటే ... కాదు వింత జీవులంటూ మరొకరు .. అడవి జంతువులు అంటూ ఇంకో ప్రచారం ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు.  

మారుమూల ప్రాంతాల్లోని జనసంచారం తక్కువగా ఉన్న చోట్ల ఈ  గ్రహాంతర వాసులు సంచరిస్తోందంటూ సమీప గ్రామాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాత్రికి రాత్రే తీవ్ర గాయాలపాలవుతున్న పశువులు .. రెండు మూడు రోజులకే మరణిస్తున్నాయి.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వింత జంతువుల దాడుల్లోనే తమ పశువులు మరణిస్తున్నాయని స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో  గ్రహాంతరవాసిని బంధించారనే  వీడియోలు వైరల్ అవుతుండటంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

అయితే ఇదంతా ఒట్టి ఫేక్ అంటున్నారు అధికారులు. కొందరు ఆకతాయిలు కావాలనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి గ్రహాంతర జీవులు రాలేదని ...  ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగించేందుకు ఇలాంటి మానుపులేట్ వీడియాలు వైరల్ చేస్తున్నవారిపై చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. గాయాలబారిన పడిన పశువుల శాంపిల్స్ సేకరించామని ..రిపోర్ట్ వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల సంగతి ఎలా ఉన్నా ...  ప్రజలు ధైర్యంగా బయటకు రాలేని పరిస్ధితులు ఉన్నాయంటూ స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

English Title
Alien In karnataka

MORE FROM AUTHOR

RELATED ARTICLES