అతి త్వరలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ

Submitted by arun on Tue, 01/02/2018 - 17:59

రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై కొత్తకాలంగా చర్చ నడుస్తోంది. కానీ అది ఇన్ని రోజులు కేవలం రూమర్స్ గానే మిగిలిపోయింది. అయితే అది ఎట్టకేలకు నిజం కాబోతోంది. త్వరలోనే ప్రభాస్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాసే తెలియజేశాడు.అది కూడా సాహో మూవీ తర్వాత.

బాహుబలితో నేషనల్ హీరోగా మారిపోయిన ప్రభాస్ కు..బాలీవుడ్ నుంచి బోలెడన్నీ ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ బాడా నిర్మాత కరణ్ జోహర్ ప్రభాస్ ను సంప్రదించాడని..దానికి ప్రభాస్ హై రెమ్యూనరేషన్ అడగడంతో అది అట కెక్కిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ నిజంగానే బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడు.

సాహో మూవీలో బిజీగా ఉన్న ప్రభాస్ ను ఓ ప్రముఖ మీడియా ఏజెన్సీ ఇంటర్ వ్యూ చేసింది. ఆ ఇంటర్ వ్యూ లో బాలీవుడ్ ఎంట్రీ గురించి కీలక సమాచారం తెలియజేశాడు. బాలీవుడ్ లో తర్వలోనే ఓ సినిమా చేయబోతున్నానన్నాడు. మూడేళ్ల క్రితమే ఈ సినిమాను ఓకే చేశాను. అది ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ. కథ బాగా నచ్చడంతో అప్పుడే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానన్నాడు. సాహో తర్వాత ఈ మూవీనే చేయబోతున్నానని క్లారిటీ ఇచ్చాడు.

బాలీవుడ్ సినిమా గురించి చెప్పిన ప్రభాస్..దానికి దర్శక, నిర్మాతలెవరనేది వెల్లడించలేదు. కరణ్ జోహర్ నిర్మిస్తున్నాడా లేక ఇంకెవరైననా అనేది ఆసక్తిగా మారింది. కరణ్ జోహర్ తో వచ్చిన మనస్వర్థాలు పై క్లారిటీ ఇవ్వని ప్రభాస్..అతను తనకు మంచి స్నేహితుడని..తనతో ఏవిషయమైనా మోహమాటం లేకుండా మాట్లాడగలనన్నారు. మొత్తానికి ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాదిలోనే ఉండబోతోంది. బాహుబలితో వచ్చిన నేమ్ ను ఉపయోగించుకుని నేషనల్ హీరోగా నిలదొక్కువాలని ట్రై చేస్తున్నాడు.

బాహుబలి సినిమాతో తనపై నెలకొన్న అంచనాలను అందుకునేందుకు ప్రభాస్ సాహో మూవీని యూనివర్సల్ సబ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీసుకువస్తున్నాడు. మూడు భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇదే రేంజ్ లో ఉంటుందనుకుంటే..కమర్షియల్ సినిమాల కాకుండా లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. స్టోరీ బాగుండడంతోనే సినిమాను ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. సాహో మూవీ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. డిసెంబర్ కల్లా సాహోను కంప్లీట్ చేసి..బాలీవుడ్ మూవీని స్టార్ట్ చేయనున్నాడు. అయితే కృష్ణంరాజు తో చేయబోయే దందా మూవీ విశేషాలు తెలియాల్సి ఉంది.

English Title
After Saaho, Prabhas to debut in Bollywood as a romantic hero

MORE FROM AUTHOR

RELATED ARTICLES