బిగ్ బాస్ హౌజ్ నుంచి తర్వాత బయటకు వచ్చేది ఆయనే: సినీ నటి అర్చన

బిగ్ బాస్ హౌజ్ నుంచి తర్వాత బయటకు వచ్చేది ఆయనే: సినీ నటి అర్చన
x
Highlights

బిగ్ బాస్ సీజన్-2లో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు నిష్క్రమించబోతున్నారనే విషయాన్ని సినీ...

బిగ్ బాస్ సీజన్-2లో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు నిష్క్రమించబోతున్నారనే విషయాన్ని సినీ నటి అర్చన తెలిపింది. తర్వాత ఎలిమినేట్ అయ్యేది హేతువాది బాబు గోగినేనేనని జోస్యం చెప్పారు. అయితే ఆయనొక్కరే అని కాదని... మరో ఐదుగురు కూడా ఉన్నారని... ఆ పేర్లు బయటపెట్టలేనన్నారు. ఇదిలా ఉంటే వ్యాఖ్యాతగా నాని చక్కగా చేస్తున్నారని కితాబిచ్చారు. తారక్ గొప్పగా చేశాడని... అందులో ఏమాత్రం సందేహం లేదన్నారు. ఈ షో జనంలోకి వెళ్లడానికి టైమ్ పడుతుందన్నారు. హౌజ్‌లో తనకిష్టమైన వాళ్లు ఉన్నారని చెప్పిన అర్చన.. ఆ పేర్లు చెప్పడానికి మాత్రం అయిష్టత వ్యక్తం చేశారు. అయితే వాళ్లను సేవ్ చేయడానికి చివర్లో బయటపెడతా అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories