బిగ్‌బాస్ సెట్లో ప్రమాదం... ఒకరి మృతి

Submitted by arun on Mon, 09/10/2018 - 16:02

బిగ్‌బాస్‌ షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తమిళ బిగ్‌బాస్‌ కార్యక్రమానికి సంబంధించిన చిత్రీకరణ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పూందమల్లి సమీపంలోగల సెంబరంబాక్కం ప్రాంతంలో కమల్‌ హాసన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. ఈ సెట్లో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న గుణశేఖర్ అనే వ్యక్తి ఈరోజు(సోమవారం) ఉదయం హౌస్ రెండవ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. దీంతో అతని తలకి తీవ్ర గాయమై రక్తస్రావం బాగా జరిగింది. ఘటన జరిగిన వెంటనే బిగ్‌బాస్ సిబ్బంది గుణశేఖర్‌ను హాస్పిటల్‌కు తరలించారు కానీ అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.
 

English Title
Accident on Bigg Boss 2 Tamil sets, technician dead

MORE FROM AUTHOR

RELATED ARTICLES