ప‌ద‌హారేళ్ల ప్రాయంలో 'స్టూడెంట్ నెం.1'

x
Highlights

'బాహుబ‌లి' సిరీస్‌తో తెలుగు సినిమాని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అలాంటి ద‌ర్శ‌క‌మౌళి రూపొందించిన తొలి చిత్రమే...

'బాహుబ‌లి' సిరీస్‌తో తెలుగు సినిమాని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అలాంటి ద‌ర్శ‌క‌మౌళి రూపొందించిన తొలి చిత్రమే 'స్టూడెంట్ నెం.1'. క‌థానాయ‌కుడిగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కి రెండో సినిమా అయిన ఈ 'స్టూడెంట్ నెం.1'.. అత‌నికి తొలి విజ‌యాన్నిచ్చింది. అంతేకాకుండా.. 'అన్న‌మ‌య్య' త‌రువాత స‌రైన హిట్ లేని సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణికి మ‌ళ్లీ క్రేజ్‌ని తీసుకువ‌చ్చింది కూడా ఈ సినిమానే.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో పాట‌ల‌న్నీ సూప‌ర్‌హిట్టే. ముఖ్యంగా 'ప‌డ్డామండి ప్రేమ‌లో మ‌రి', 'ఎక్క‌డో పుట్టి ఎక్క‌డో పెరిగి' పాట‌లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటాయి. 'ఎక్క‌డో పుట్టి ఎక్క‌డో పెరిగి' పాట కోసం ఎం.ఎం.కీర‌వాణి ఉత్త‌మ గాయ‌కుడిగా నంది పుర‌స్కారాన్ని కూడా అందుకోవ‌డం విశేషం. గ‌జాలా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా స్వ‌ప్న సినిమా ప‌తాకంపై తెర‌కెక్కింది. త‌మిళం, ఒడియా భాష‌ల్లో సైతం రీమేక్ అయ్యింది. 2001లో ఇదే తేదిన వ‌చ్చిన 'స్టూడెంట్ నెం.1'.. నేటితో 16 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories