ఉక్కుపాదం మోపనిదే... ఉగ్రవాదం అంతం ఎలా?

ఉక్కుపాదం మోపనిదే... ఉగ్రవాదం అంతం ఎలా?
x
Highlights

ఏడు దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన పాకిస్థాన్ కుతంత్రాలు తారస్థాయికి చేరుకున్నాయి. సరిహద్దుల వెలుపలి నుంచి కొనసాగిన కుట్రలు ఇప్పుడు దేశంలో నుంచే పంజా...

ఏడు దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన పాకిస్థాన్ కుతంత్రాలు తారస్థాయికి చేరుకున్నాయి. సరిహద్దుల వెలుపలి నుంచి కొనసాగిన కుట్రలు ఇప్పుడు దేశంలో నుంచే పంజా విసిరాయి. గతంలో జరిగిన సర్జికల్ దాడులు పాకిస్థాన్ ను అణుమాత్రం కూడా భయపెట్టలేకపోయాయి. తాజాగా జరిగిన ఉగ్రదాడినే అందుకు నిదర్శనం. ఉగ్రవాదం భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉగ్రదాడులతో సతమతమవుతూనే ఉన్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం టెర్రరిస్టులకే టెర్రర్ గా మారాయి. ఉగ్రదాడులను ఆపలేకపోయినా....భయానక రీతిలో ప్రతీకార చర్యలు తీసుకున్నాయి. భారత్ లాంటి దేశాలు మాత్రం దశాబ్దాలుగా ఉగ్రదాడులపై సహనంతోనే వ్యవహరిస్తున్నాయి. ఉగ్రవాదం పెచ్చుమీరిన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి భారత్ అందుకు సిద్ధంగా ఉందా ? పాకిస్థాన్ కు మరుపురాని గుణపాఠం నేర్పేందుకు వీలవుతుందా? ఉగ్రదాడులపై ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించనుందన్న అంశాలన్నీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

పాకిస్థాన్ గనుక తన విధానాలను మార్చుకోకపోతే ఆ దేశం 10 ముక్కలై పోతుందని అప్పట్లో రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. పాకిస్థాన్ కు అవి తాటాకు చప్పుళ్ళే అయ్యాయి. అందుకే తాజా ఉగ్రదాడిలో 42 మంది జవాన్ల దేహాలు ముక్కచెక్కలుగా మారిపోయాయి. అదే నేడు భారత ప్రజానీకాన్ని ఆగ్రహావేశాల్లో ముంచెత్తుతోంది. పాకిస్థాన్ పై ఏదో ఒక చర్య తీసుకోవాలన్న డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. ప్రజల ఆవేశం ఉన్న స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నది నిజమే...కాకపోతే దాన్ని భరించేందుకూ ఒక హద్దు అనేది ఉంటుంది. ప్రజల ఆవేశం ఇప్పుడు ఆ హద్దు దాటుతోంది. దాంతో ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. మరో వైపు రక్షణ బలగాలు సైతం ప్రతీకారం తీర్చుకునేందుకు తగిన ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. మరి అలాంటి ఆదేశాలు ఇవ్వడంలో భారత్ కు ఉన్న ఇబ్బందులేంటి అన్నదే ఇప్పుడు కీలకంగా మారుతోంది.

అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా......లాంటి దేశాల్లోనూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అయితే ఆ దేశాలేవీ కూడా భారత్ తరహాలో మౌనంగా ఉండలేదు. అమెరికా అయితే ఏకంగా వేల మైళ్ళు దాటి వచ్చి పాకిస్థాన్ భూభాగంపై దాడి చేసి బిన్ లాడెన్ ను మట్టుబెట్టింది. ఇక ఇజ్రాయెల్ గురించి చెప్పనక్కర్లేదు. మానవహక్కులను, అంతర్జాతీయ నియమ నిబంధనలను సైతం పక్కనపెట్టేసింది. తమ దేశ రక్షణకే పెద్దపీట వేసింది. ఉగ్రదాడి చేయడం తరువాతి సంగతి.....అలా చేస్తారన్న అనుమానం వస్తే చాలు....వారిని కాల్చివేయడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ఇక బ్రిటన్ ఇతర దేశాల్లో ఉగ్రచర్యలకు పాల్పడే వారిని పెద్దగా పట్టించుకోనప్పటికీ.....తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారి పట్ల మాత్రం కఠిన వైఖరి అనుసరిస్తోంది. ఫ్రాన్స్ కూడా ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది. చైనా విషయానికి వస్తే....ఉగ్రవాదంతో ముప్పు ఉందన్న భయంతో ఏకంగా ముస్లిం మతాన్ని అణిచివేయడం మొదలుపెట్టింది. మరి ఈ తరహా దూకుడు చర్యలు భారతదేశం ఎందుకు తీసుకోలేకపోతున్నది అనే అనుమానం ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతోంది.

వినే వారుంటే .....అంతా సుద్దులు చెబుతారు...ఎదిరిస్తే...అంతా నోరు మూసుకుంటారు. అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో జరిగింది ఇదే. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఆ రెండు దేశాలు ఎంతగా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. భారత్ విషయానికి వస్తే....ఏ మాత్రం తీవ్ర చర్య తీసుకున్నా......అంతర్జాతీయ సమాజం విధించే ఆంక్షలను ఎదుర్కోనే స్థితిలో లేదు. మరో వైపు రక్షణ విభాగం పేరుకు గొప్పగా ఉన్నా లోపల ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాకిస్థాన్ పై తీవ్ర చర్యలు తీసుకోవడంలో భారత్ ముందరి కాళ్ళకు బంధాలుగా మారుతున్నాయి. అంతేగాకుండా అంతర్గతంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపనిదే బయటి శక్తులను ఎదర్కోవడం సాధ్యం కాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories