కాంగ్రెస్‌లో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ తగ్గిపోయాయా?

కాంగ్రెస్‌లో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ తగ్గిపోయాయా?
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌‌లో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పూర్తిగా పడిపోయాయి. వచ్చే ఐదేళ్లపాటూ ప్రతిపక్షంలో ఉండే ఓపిక లేని నేతలు వలసబాట పడుతున్నారు. ఇప్పటి వరకు...

తెలంగాణ కాంగ్రెస్‌‌లో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పూర్తిగా పడిపోయాయి. వచ్చే ఐదేళ్లపాటూ ప్రతిపక్షంలో ఉండే ఓపిక లేని నేతలు వలసబాట పడుతున్నారు. ఇప్పటి వరకు 8మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువాలు కప్పుకుంటుంటే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి, సీనియర్ లీడర్ డీకే అరుణ మాత్రం బీజేపీ గూటికి చేరారు. ఆది నుంచి హస్తంలోనే ఉన్న డీకే అరుణ లోక్‌సభ ఎన్నికల టైమ్‌లో తన కెరీర్‌ను చక్కదిద్దుకుంటూ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌ షాక్‌కు గురైంది. తెలంగాణపై అసలు బీజేపీ వ్యూహం ఏంటి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో ఓడిపోయిన తర్వాత నుంచే డీకే అరుణలో నిరాశ కలిగించింది. అప్పటి నుంచీ ఆమె... కాంగ్రెస్‌లో ఉన్నా లేనట్లుగా ఉంటున్నారు. ఇప్పుడు నామినేషన్ల ఘట్టం నడుస్తుండటంతో చాలా మంది నేతలలాగే ఆమె కూడా హస్తానికి హ్యాండిచ్చారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ బరిలో దిగుతున్నారు. అయితే డీకే అరుణ లాంటి సీనియర్ నేత కూడా పార్టీని వీడిపోవడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయి. ఇప్పటికే చాలా మంది నేతలు వేరే పార్టీల్లోకి జంప్ అవ్వడంతో కాంగ్రెస్ కార్యాలయం దాదాపు ఖాళీ అయ్యింది. స్వయంగా సీనియర్లే వెళ్లిపోతుండటంతో కేడర్‌ చెల్లా చెదురవుతోంది.

కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ డీకే అరుణ బీజేపీలోకి వెళ్లిపోయారు. సరే. మరి డీకే అరుణ తరువాత ఎవరు? తెలంగాణపై బీజేపీ వ్యూహం ఏమిటి? నిజానికి డీకే ఆరుణ... టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకుంటున్నారు కార్యకర్తలు. ఆ పోస్టును తనకు ఇవ్వాల్సిందిగా ఆమె కోరగా హైకమాండ్ పట్టించుకోలేదని సమాచారం. ఈ విషయంలో హైకమాండ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అరుణ... తనేంటో నిరూపించుకోవాలని డిసైడయ్యే... పార్టీ మారినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె కమలం గూటికి వెళ్లారనీ, లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం ద్వారా తన సత్తా చాటాలన్నది అరుణ అంతరంగమన్న ప్రచారం ఉంది. డీకే అరుణే పార్టీ మారడంతో ఆమెలాగే మరికొందరు సీనియర్లు కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో టాక్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories