పబ్జీ... పీల్చి పిప్పి చేస్తోంది.. పేరెంట్స్‌ బీకేర్‌ఫుల్‌

పబ్జీ... పీల్చి పిప్పి చేస్తోంది.. పేరెంట్స్‌ బీకేర్‌ఫుల్‌
x
Highlights

అదో పిచ్చి.. అదో మేనియా.. నిరంతరం మనల్ని ఆడిస్తుంది.. ఒక కిక్కులో ముంచేస్తుంది... మనల్ని గెలిపిస్తుంది.. ఓడిస్తుంది.. మన జీవితాన్నే తన గుప్పిట్లో...

అదో పిచ్చి.. అదో మేనియా.. నిరంతరం మనల్ని ఆడిస్తుంది.. ఒక కిక్కులో ముంచేస్తుంది... మనల్ని గెలిపిస్తుంది.. ఓడిస్తుంది.. మన జీవితాన్నే తన గుప్పిట్లో బంధిస్తుంది.. అదే మొబైల్ గేమ్ పబ్జీ... బ్లూ వేల్, పోకే మాన్... ఇప్పుడు లేటెస్ట్ గా పబ్జీ.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ డెత్ గేమ్.. యువత ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అమాయక యువతను బలి తీసుకుంటోంది. ఈ మొబైల్ గేమ్ మేనియా నుంచి బయటపడే అవకాశం లేదా? వదల నివ్వదు.. కదల నివ్వదు.. ఆడిస్తుంది.. పోరాడిస్తుంది.. ఒక మత్తులో ముంచెత్తిస్తుంది.. ఆ గేమ్ కి ఎడిక్ట్ అయ్యామా ఏదో ఓరోజు పిచ్చివారిగా మారిపోతాం.. చంపు లేదా చావు.. అని మనల్ని నడిపించే డేంజర్ గేమ్ పేరే పబ్జీ..

తుపాకుల కాల్పులు. చంపుకోడాలు, ఎత్తుగడలు.. పోరాటం.. హాలీవుడ్ థ్రిల్లర్ ను తలపించే లాఎత్తుగడలు.. మనం ఎక్కడున్నా ఇది మనల్ని శాసిస్తుంది.. ఈ మొబైల్ గేమ్ ఇప్పుడు జనాన్ని పిచ్చోళ్లను చేస్తోంది. గంటా.. లేదా రెండు గంటలు ఆడటం ఒక తీరు.. కానీ ఈ గేమ్ లోకి దిగామా? టైమ్ తెలియదు.. మనమెక్కడున్నామో తెలీదు.. ఏం చేస్తున్నామో అంతకన్నా తెలీదు.. అదో మేనియా.. నిరంతరం మొబైల్ బటన్స్ నొక్కుతూనే ఉంటాం.. ప్రత్యర్ధిని చంపాలన్న కసితో రగిలిపోతుంటాం.. స్కూళ్లు, కాలేజీలు, మీటింగ్ స్పాట్ లు.. పబ్బులు. ఎక్కడైనా సరే ఇదే గేమ్. అందరిలో ఒకరిగా ఉండాల్సిన మనిషి అందరికీ దూరంగా.. మొబైల్ పట్టుకుని గేమ్ లో మునిగిపోతున్నారు.. స్నేహితులు, చదువు, ఉద్యోగం, ఆఫీసు.. అన్నీ.. అన్నీ.. వదిలేసి పబ్జీ గేమ్ లో మునిగి తేలుతున్నారు కొందరు..

మొబైల్ గేమ్స్ లో సవాలక్ష గేములున్నాయి.. కానీ వాటి వేటికీ లేని కిక్కు ఈ గేమ్స్ కి ఉంది. అలవాటు పడ్డామా అదే మన పాలిట డెత్ గేమ్ గా మారుతుంది.. గేమ్ మాయలో పడి ఓడిపోయి ఓడిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోతాం.. లేదా గెలవలేదన్న అక్కసుతో ఎవరో ఒకరిని చంపాలన్న కసి పెరుగుతుంది. ఒక మొబైల్ గేమ్ కి ఇంత శక్తా అని ఆశ్చర్యపోయేవారున్నారు.. కానీ ఇది ప్లేయర్స్ అన్ నోన్ బ్యాటిల్ గేమ్.. అందుకే.. ఇందులో మనిషిని మాయ చేసే కిక్కుంది.. గేమ్ మొదలవగానే రెప్ప వేయనివ్వదు, కదల నివ్వదు. వదల నివ్వదు.. ఒక దురలవాటుగా మార్చేస్తుంది.. గేమ్ ప్రారంభమే విచిత్రంగా ఉంటుంది.. వందల మంది సాయుధులున్న యుద్ధ క్షేత్రంలో బరిలోకి దిగి ఒక వెపన్ ని సాధించడమే తొలి ఛాలెంజ్.. వందమందిలో దూరి ఒక ఆయుధం చేపట్టగలిగితే గేమ్ లో తొలి విజయం సాధించినట్లే.. ఇక అక్కడినుంచి మొదలవుతుంది.. అసలు కథ.. చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతుంటాయ్.. మనల్ని కవ్విస్తుంటాయ్.. ఇంకా ఇంకా ఆడాలని ప్రేరేపిస్తుంటాయ్.. యుద్ధ క్షేత్రంలో ఉన్నామన్న ఫీలింగ్ మనల్ని ముందుకురకమని వెంటాడుతుంటుంది.ఎదుటి వాడిని అంతం చేయాలన్న కసి.. సాధించాలన్న పట్టుదల.. బాంబులు, గ్రెనేడ్లు, తుపాకులు ఒకరినొకరు చంపుకోడం, కాల్చుకోడం,వెంటాడటం.. హతమార్చడం..ఇలా గేమ్ ఆడినంత సేపు మనల్ని గుక్క తిప్పుకోనివ్వదు. ఊపిరి తీసుకోనివ్వదు.. నిరంతర వేటలో మనం మనల్ని మర్చిపోయేలా చేస్తుంది..

Show Full Article
Print Article
Next Story
More Stories