మోగనున్న గుడి గంటలు.. మసీదులు, చర్చిల్లో ప్రారంభంకానున్న ప్రార్ధనలు

మోగనున్న గుడి గంటలు.. మసీదులు, చర్చిల్లో ప్రారంభంకానున్న ప్రార్ధనలు
x
Highlights

80రోజులుగా మూతపడిన ఆలయాల్లో నేడు గుడి గంటలు మోగనున్నాయి. రెండున్నర నెలలుగా మూగబోయిన చర్చిలు, మసీదుల్లో ప్రార్ధనలు ప్రారంభంకానున్నాయి. కరోనా...

80రోజులుగా మూతపడిన ఆలయాల్లో నేడు గుడి గంటలు మోగనున్నాయి. రెండున్నర నెలలుగా మూగబోయిన చర్చిలు, మసీదుల్లో ప్రార్ధనలు ప్రారంభంకానున్నాయి. కరోనా లాక్‌-డౌన్‌ కారణంగా మూతపడిన ఆలయాలు, చర్చిలు, మసీదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య కార్యాలయాలు‌ నేడు తెరుచుకోనున్నాయి.

కరోనా లాక్‌-డౌన్‌ కారణంగా మూతపడిన ఆలయాలు, చర్చిలు, మసీదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య కార్యాలయాలు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకోనున్నాయి. గుడి గంటలు మోగడమే కాకుండా మసీదులు, చర్చిల్లో ప్రార్ధనలు ప్రారంభంకానున్నాయి. అలాగే, మసీదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

రెండు నెలల 17రోజుల తర్వాత ఆలయ ద్వారాలు తెరిచేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, అలాగే 60ఏళ్లు పైబడినవారి ప్రవేశంపై నిషేధం విధించింది. ఇక, తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. అలాగే, ఆలయ ద్వారాల దగ్గర భక్తులకు థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు శానిటైజ్ చేయాలి. ఒకేవిధంగా చెప్పాలంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య భక్తులకు భగవంతుని దర్శనం లభించనుంది. అయితే, శఠగోపురం, తీర్థ ప్రసాదంతోపాటు ఆశీర్వచనాలు ఉండవు. అలాగే, అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలకు అనుమతి ఉండదు.

ఇక, మసీదులు, చర్చిల్లో కూడా దాదాపు ఇలాంటి జాగ్రత్తలే కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం ఆలయాలు, మసీదులు, చర్చిల్లో భక్తుల ప్రవేశం నిషేధం కొనసాగనుంది.

సుమారు 80రోజుల లాంగ్‌ క్లోజింగ్ తర్వాత తెరుచుకోనున్న వాణిజ్య కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా... థర్మల్‌ స్క్రీనింగ్ నిర్వహించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే అనుమతించాల్సి ఉంటుంది. అలాగే, సిబ్బంది, వినియోగదారులు కచ్చితంగా మాస్కులు, గ్లౌజులు ధరించాలి. ముఖ‌్యంగా షాపింగ్ మాల్స్‌, హోటల్స్‌, రెస్టారెంట్ల సామర్ధ్యంలో సగం మందినే అనుమతించాల్సి ఉంటుంది. అదేవిధంగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడమే కాకుండా... కస్టమర్ల తాకిడి మేరకు సోడియం హైపోక్లోరైడ్ లాంటి ద్రావణంతో శానిటైజ్ చేయాలి. షాపింగ్ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా వృద్ధులు, చిన్నపిల్లలకు అనుమతి ఉండదు. అలాగే, డిస్పోజబుల్ మెనూ కార్డులు అందుబాటు ఉంచాలి. హోటళ్లు, రెస్టారెంట్లలో సెంటలైజ్డ్ ఏసీ వినియోగం తగ్గించి బయటి గాలి లోపలికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ ఏసీలు వినియోగించినా టెంపరేచర్స్‌ 24 నుంచి 30 డిగ్రీలకే పరిమితం చేయాల్సి చేయాలని కేంద్రం ఆదేశించింది.

ఆలయాలు, చర్చిలు, మసీదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య కార్యాలయాలు ఇలా ఏవైనాసరే ఎంట్రన్స్‌లో థర్మల్ స్ర్కీనింగ్‌తోపాటు శానిటైజ్ చేశాకే లోపలికి అనుమతించాలి. ఇక, భక్తులు, కస్టమర్ల వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రత్యేక రిజిస్టర్‌ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచించిన మార్గదర్శకాలను అటు యాజమాన్యాలు, ఇటు వినియోగదారులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories